Home > అంతర్జాతీయం > ఊరంతా బూడిదైంది.. కానీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు.. ఎందుకంటే..?

ఊరంతా బూడిదైంది.. కానీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు.. ఎందుకంటే..?

ఊరంతా బూడిదైంది.. కానీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు.. ఎందుకంటే..?
X

అమెరికాను కార్చిచ్చు భయపెడుతోంది. కార్చిచ్చు సృష్టించిన బీభత్సానికి లహైనా రిసార్టు సిటీ ప్రజలు అల్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ నగరం బూడిదగా మారింది. మంటల ధాటికి దాదాపు అన్ని ఇళ్లు కాలి బూడిదవ్వగా.. 100మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఓ బిల్డింగ్కు మాత్రం కొంచెం నష్టం కూడా జరగలేదు. చుట్టూ బూడిదైన భవనాల మధ్య చెక్కుచెదరకుండా ఉంది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

లహైనా సిటీలోని ఓ ఫ్రంట్‌ స్ట్రీట్‌లో బూడిదలా మారిన నిర్మాణాల మధ్య రెడ్‌ రూఫ్‌ కలిగిన భవనం చెక్కుచెదరకుండా ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భవనం చుట్టూ ఉన్న నిర్మాణాలు అన్నీ బూడిదగా మారగా.. ఆ ఒక్క బిల్డింగ్ మాత్రం కార్చిచ్చు నుంచి ఎలా తప్పించుకుందని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఫొటోషాప్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భవన యజమానురాలు డోరా మిలికన్ స్పందించారు. అది నిజమైన ఫొటోనే అని స్పష్టం చేశారు.

మూడేళ్ల క్రితం ఆ భవనాన్ని కొనుగోలు చేసినట్లు మిలికన్ చెప్పారు. 100ఏళ్ల పురాతనమైన ఆ భవనానికి ఎటువంటి మరమ్మత్తులు చేయించలేదని చెప్పారు. ‘‘మాది కూడా చెక్క ఇల్లే. అయితే ఇంటి పైకప్పును మాత్రం మార్చాం. ఆస్ఫాల్ట్‌ రూఫ్‌ను తొలగించి హెవీ-గేజ్ మెటల్‌తో రీప్లేస్ చేశాం. పైకప్పే తమ ఇంటిని కార్చిచ్చు నుంచి కాపాడిందని భావిస్తున్నాం. నిప్పు కణికలు పైకప్పులపై పడటంతో మిగితా ఇళ్లు కాలిపోగా.. మా ఇంటిపై మెటల్‌ రూఫ్‌ ఉండటంతో నష్టం తప్పింది. అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్న గడ్డిని తొలగించి బండలతో ఫ్లోరింగ్ వేయించాం’’ అని చెప్పారు.





Updated : 22 Aug 2023 2:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top