Home > అంతర్జాతీయం > ఇలాంటి అగ్నిప్రమాదాన్ని మీరెప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్

ఇలాంటి అగ్నిప్రమాదాన్ని మీరెప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్

ఇలాంటి అగ్నిప్రమాదాన్ని మీరెప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్
X

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎత్తైన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ కింది నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ నిప్పుల కుంపటిలా మారడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే భవనంలో ప్రజలను పలు హోటళ్లకు తరలించారు.





యూఏఈ ప్రభుత్వ లెక్కల ప్రకారం అగ్నిప్రమాదాలు భారీగా పెరిగాయి. 2020లో 1968,2021లో 2090, 2022లో 3వేలకు పైగా అగ్నిప్రమాదాలు జరిగినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్కువ ప్రమాదాలు నివాస ప్రాంతాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో దుబాయ్ లో జరిగిన ప్రమాదంలో 16మంది మరణించారు.



Updated : 27 Jun 2023 12:31 PM IST
Tags:    
Next Story
Share it
Top