Home > అంతర్జాతీయం > Hyundai : హ్యూందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ?

Hyundai : హ్యూందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ?

Hyundai : హ్యూందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ?
X

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఐపీఓకి సిద్ధమవుతోంది. దీపావళి కల్లా హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇఘ్యాకు రావొచ్చని సమాచారం. ప్రముఖ ఇన్వెస్టమెంట్ బ్యాంక్‌లు కంపెనీ విలువను 22-28 బిలియన్ డాలర్లుగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఐపీఓ భారీగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా.. 15-20శాతం వాటా విక్రయించాలని హ్యుందాయ్​ ప్లాన్​ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా.. రూ. 27,390 కోట్ల నుంచి రూ. 46,480 కోట్లను సమకూర్చాలని సంస్థ భావిస్తోందని సమాచారం.

హ్యుందాయ్‌ (Hyundai) 1996లో భారత్‌లోకి ప్రవేశించింది. ప్రపంచంలో ఈ కంపెనీకి భారత్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌. క్రెటా, ఎక్స్‌టర్‌, వెర్నా, ఐ20, గ్రాండ్‌ ఐ10, నియోస్‌, టక్సన్‌, అల్కజార్‌ వంటి ప్రముఖ కార్లను విక్రయిస్తోంది. 2023లో దేశీయంగా 6.02 లక్షల వాహనాలను విక్రయించింది. 1.63 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. 2022-23లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.59,781 కోట్లకు చేరింది. ఆదాయం 14.33 శాతం పుంజుకుంది. నికర లాభాలు 62 శాతం పెరిగి రూ.4,653 కోట్లకు చేరాయి.

హ్యుందాయ్‌ భారత్‌లోకి ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలు గడిచింది. గత ఏడాది దేశంలో రెండో అతిపెద్ద ప్రయాణికుల వాహన విక్రయ సంస్థగా (HMIL) నిలిచింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ, జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, డాయిషే బ్యాంక్‌, యూబీఎస్ వంటి బడా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు ఐపీఓ అవకాశాలను గతవారం కంపెనీకి వివరించినట్లు సమాచారం. హెచ్‌ఎంఐఎల్‌ విలువను ఈ సంస్థలు 22-28 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. దీంట్లో 15-20 శాతం వాటాను ఐపీఓలో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.27,500- 46,500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అదే జరిగితే భారత్‌లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ (IPO) ఇదే అవుతుంది. ఇప్పటి వరకు రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ ఐపీఓనే పెద్దది. భారత్ ఈక్విటీ మార్కెట్ తోపాటు ఆసియా-పసిఫిక్ దేశాల ఎక్స్చేంజ్ ల్లో పలు సంస్థలు లిస్టింగ్ అయ్యాయి. హ్యుండాయ్ మోటార్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 22-28 బిలియన్ డాలర్లు ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నట్లు సమాచారం. వచ్చే దీపావళి నాటికి ఐపీఓ ద్వారాలో లిస్టింగ్ తో 39 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. దీంతో భారత్ లోనూ హ్యుండాయ్ ఎం-క్యాప్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Updated : 5 Feb 2024 10:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top