Home > అంతర్జాతీయం > Bill Gates:వీకెండ్ హాలీడేస్ గురించి బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Bill Gates:వీకెండ్ హాలీడేస్ గురించి బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Bill Gates:వీకెండ్ హాలీడేస్ గురించి బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
X

లైఫ్‌ని ఎంజాయ్ చేయడాన్ని కూడా మరిచిపోయేలా కష్టపడి పనిచేయొద్దని సూచించారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్. జీవితమంటే పని ఒక్కటే కాదని.. పనికంటే జీవితం ఎంతో గొప్పదని స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. వీకెండ్ సెలవులపై బిల్ గేట్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సంస్థలో పనిచేసే తొలినాళ్లలో వీకెండ్ సెలవులు తీసుకోవడం, పనిచేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని పేర్కొన్నారు. అయితే తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘నేను నా పిల్లల వయసులో ఉన్నప్పుడు సెలవులపై అంత ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా తండ్రిని అయ్యాక నా అభిప్రాయం మారింది. పని కంటే జీవితం విలువైందని గ్రహించా’ అని తెలిపారు. తన పిల్లల ఎదుగుదల చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అయితే ఇంతకుముందు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి బిల్ గేట్స్ చాలా గొప్పగా మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ .. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని సూచించారు. ఇక భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ ఫౌండర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Updated : 25 Dec 2023 8:11 AM IST
Tags:    
Next Story
Share it
Top