Home > అంతర్జాతీయం > Ukraine : పారిస్ను ముట్టడించిన రైతులు..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Ukraine : పారిస్ను ముట్టడించిన రైతులు..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Ukraine : పారిస్ను ముట్టడించిన రైతులు..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
X

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఫ్రాన్స్‌ రైతులపై విపరీతంగా పడుతోంది. రైతన్నలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన, ర్యాలీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పెద్ద పెద్ద గడ్డివాములతో పారిస్‌ను ముట్టడించారు రైతులు. పారిస్‌కు వెళ్లే రోడ్లను ట్రాక్టర్ల ద్వారా ముసివేశారు. రీసెంట్ గానే ఆ దేశ ప్రధానీగా గాబ్రియెల్‌ అటల్‌ బాధ్యతలు తీసుకున్నారు. ప్రధానీగా బాధ్యతలు తీసుకొని కనీసం నెల అయినా కాకముందే..ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడంతో అటల్‌కు ఇది కష్టకాలంగానే కనిపిస్తోంది. ప్రధాన మంత్రి అటల్‌ ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లకు తగినట్లుగా లేవని నిరసనకారులు మండిపడ్డారు. ఆహారోత్పత్తి చాలా ఆకర్షణీయంగా, సులభంగా, న్యాయంగా ఉండాలన్నదే తమ డిమాండ్‌ అని తెలిపారు. రైతులకు మరిన్ని రాయితీలు కావాలన్నారు కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అనుకూలంగా స్పందించకపోతే..ఎన్నిరోజులైనే సరే ధర్నా చేసేందుకు వీలుగా కొందరు నిరసనకారులు సరిపడ ఆహారం, టెంట్లను తీసుకొచ్చారు.




Updated : 30 Jan 2024 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top