Home > అంతర్జాతీయం > Ceo Zuckerberg : ఒక్కసారిగా పెరిగిన మెటా ఆదాయం..వారికి శుభవార్త

Ceo Zuckerberg : ఒక్కసారిగా పెరిగిన మెటా ఆదాయం..వారికి శుభవార్త

Ceo Zuckerberg : ఒక్కసారిగా పెరిగిన మెటా ఆదాయం..వారికి శుభవార్త
X

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా ప్లాట్‌ఫారమ్ ఆదాయం 25 శాతం పెరిగింది. ఫేస్‌బుక్ 20వ వార్షికోత్సవానికి ముందుగా మెటా షేర్లు పెరగడంతో స్టాక్ మార్కెట్ హోల్డర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెటా ప్లాట్‌ఫారమ్ ఆదాయం భారీగా పెరగడంతో ఆ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 2024లో ఇప్పటి వరకూ జుకర్‌బర్గ్ నికర ఆదాయం 14.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ క్రమంలో ఆయన మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ కంటే ముందుకు చేరారు. ఆదాయం ప్రకారంగా బిల్ గేల్స్ కంటే కాస్త వెనక జుకర్‌బర్గ్ నిలిచారు.





మెటాలో జుకర్‌బర్గ్ 13 శాతం వాటాను కలిగి ఉన్నాడు. 2004 తర్వాత తన కంపెనీ షేర్లు ఇప్పుడే తొలిసారిగా పెరిగాయి. కంపెనీ ఆదాయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఫేస్‌బుక్ యాజమాన్యం తన తొలి డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌ను 50 సెంట్లు వరకూ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మెగా నికర విలువ మరింత పెరగనుంది. గురువారం పోస్ట్ మార్కెట్ ట్రేడింగ్‌లో మెటా షేర్లు 15 శాతం పెరిగి లాభాలను చూశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లు పెరిగింది. దీనివల్ల మెటా కంపెనీ మొత్తం ఆదాయం 1.17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్‌వాచ్ నివేదిక తెలిపింది.





గత 12 నెలల్లో మెటా షేర్లు 109 శాతం పెరిగాయి. అక్టోబర్ 2021లో ఫేస్‌బుక్ తనపేరును మెటా ప్లాట్‌ఫారమ్‌గా మార్చుకుంది. ఆదాయం 25 శాతం పెరిగి 40 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో మెటా షేర్లు లాభాల బాట పట్టాయి. దీంతో ఒక్కో షేర్ విలువ 4.97 డాలర్ల కంటే మరింత పెరగనుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. షేర్ల పెరుగుదలతో జుకర్‌బర్గ్ సంవత్సరానికి 700 మిలియన్ డాలర్ల వరకూ పొందనున్నాడు. ఇది కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడనుంది. దీనివల్ల పెట్టుబడిదారులు ఎక్కువగా మెటా కంపెనీ షేర్లను కొనే అవకాశం ఉంది.






Updated : 3 Feb 2024 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top