ఇజ్రాయెల్లో యుద్ధ వాతావరణం.. భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
X
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్ల దాడి అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయట అడుగుపెట్టొద్దని వార్నింగ్ ఇచ్చింది.
‘‘ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించే సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పాటించాలి. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సురక్షిత శిబిరాలకు దగ్గరగా ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండి’’ అని టెల్ అవివ్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీలో స్పష్టం చేసింది.
గాజాలోని హమాస్ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. ఇజ్రాయెల్‌పైకి వేల కొద్దీ రాకెట్లు పంపారు. అంతేకాక ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. వీధుల్లో తిరుగుతూ కాల్పులకు తెగబడుతున్నారు. అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లపై ఎదురు కాల్పులకు దిగింది. గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
📢IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL
— India in Israel (@indemtel) October 7, 2023
For details visit-
Israel Home Front Command website: https://t.co/Sk8uu2Mrd4
Preparedness brochure: https://t.co/18bDjO9gL5 pic.twitter.com/LtAMGT9CwA