Home > అంతర్జాతీయం > అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాల్లో భారత్ ర్యాంకు ఇదీ..

అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాల్లో భారత్ ర్యాంకు ఇదీ..

అత్యధిక విద్యావంతులు ఉన్న దేశాల్లో భారత్ ర్యాంకు ఇదీ..
X

విద్యావంతులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఏదని అడిగితే ఏమని సమాధానం ఇస్తారు? అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ... ఆగండి ఆగండి! మీరు ఊహించుకున్న దేశాలేవీ కాదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల దేశాలు కూడా కాదు. ఆసియా దేశమైన దక్షిణ కొరియా! ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఉన్న దేశంగా ద.కొరియా రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అలాంటివారు ఏకంగా 69 శాతం మంది ఉన్నారు. ‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ అనే ట్విటర్ హ్యాండిల్ చేసిన అధ్యయనంలో ఈ లెక్క తేలింది. 20 శాతం మంది విద్యావంతులను భారత్ 43వ ర్యాంకు సంపాదించుకుంది. 23 శాతం మందితో చైనా 40వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన ఇరుగుపొరుగు దేశాలకు ఊసే లేదు.

డిగ్రీ వరకు చదివిన వారిని విద్యావంతులుగా (Educated people) గా పరిగణలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. మనదేశంలో 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్నవారిలో 20 శాతం మంది మంది మాత్రమే కాలేజీ, యూనివర్సిటీ చదువులు చదివారు. ద.కొరియా తర్వాత 67 శాతం మందితో కెనడా రెండో స్థానంలో నిలించింది. తర్వాత స్థానాల్లో జపాన్ (65 శాతం), ఐర్లాండ్ 63 శాతం, రష్యా (62) శాతం నిలిచాయి. అగ్రరాజ్యంగా భావించే అమెరికా 51 శాతంతో 15వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

ఇదీ జాబితా

1. దక్షిణ కొరియా: 69%

2. కెనడా: 67%

3. జపాన్: 65%

4. ఐర్లాండ్: 63%

5. రష్యా: 62%

6. లక్సెంబర్గ్: 60%

7. లిథువేనియా: 58%

8. యూకే: 57%

9. నెదర్లాండ్స్: 56%

10. నార్వే: 56%

11. ఆస్ట్రేలియా: 56%

12. స్వీడన్: 52%

13. బెల్జియం: 51%

14. స్విట్జర్లాండ్: 51%

15. యునైటెడ్ స్టేట్స్: 51%

16. స్పెయిన్: 50%

17. ఫ్రాన్స్: 50%

18. డెన్మార్క్: 49%

19. స్లోవేనియా: 47%

20. ఇజ్రాయెల్: 46%

21. లాత్వియా: 45%

22. గ్రీస్: 45%

23. పోర్చుగల్: 44%

24. న్యూజీలాండ్: 44%

25. ఎస్తోనియా: 44%

26. ఆస్ట్రియా: 43%

27. టర్కీ: 41%

28. ఐస్లాండ్: 41%

29. ఫిన్లాండ్: 40%

30. పోలండ్: 40%

31. చిలీ: 40%

32. స్లోవేకియా: 39%

33. జర్మనీ: 37%

34. చెకియా: 34%

35. కొలంబియా: 34%

36. హంగేరి: 32%

37. కోస్టా రికా: 31%

38. ఇటలీ: 29%

39. మెక్సికో: 27%

40. చైనా: 27%

41. సౌదీ అరేబియా: 26%

42. బ్రెజిల్: 23%

43. భారత్: 20%

44. అర్జెంటీనా: 19%

45. ఇండోనేసియా: 18%

46. దక్షిణాఫ్రికా : 13%

Updated : 2 Oct 2023 12:04 PM IST
Tags:    
Next Story
Share it
Top