Home > అంతర్జాతీయం > కెనడాలో వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!

కెనడాలో వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!

కెనడాలో వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!
X

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ వచ్చే కెనడా పౌరులకు వీసా నిలిపివేసింది. ఈ మేరకు కెనడాలో వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం.

విదేశాల్లో సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న తీరు దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. సిక్కు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం సత్సంబంధాలకు అడ్డంకిగా మారుతుందని భారత ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందంటూ ఢిల్లీ నాయకత్వం బహిరంగంగానే విమర్శిస్తోంది. ప్రస్తుత హింసను ఆపేందుకు ప్రయత్నిస్తానని, విదేశీ జోక్యాన్ని ఎంత మాత్రం సహించేది లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెబుతున్నారు.


Updated : 21 Sep 2023 7:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top