Home > అంతర్జాతీయం > బియ్యం భయం.. అమెరికాలో సూపర్ మార్కెట్లకు క్యూ కట్టిన ఎన్నారైలు

బియ్యం భయం.. అమెరికాలో సూపర్ మార్కెట్లకు క్యూ కట్టిన ఎన్నారైలు

బియ్యం భయం.. అమెరికాలో సూపర్ మార్కెట్లకు క్యూ కట్టిన ఎన్నారైలు
X

కేంద్రం నిర్ణయంతో అమెరికాలోని ఎన్నారైలకు బియ్యం పట్టుకుంది. బియ్యం కోసం సూపర్ మార్కెట్లకు క్యూకట్టారు. సోనామసూరి బియ్యం కోసం సూపర్ మార్కెట్లలో పోటీ పడుతున్నారు. అమెరికా మొత్తం ఇదే సీన్ కన్పిస్తోంది. ఎన్నారైలు ఒక్కసారిగా బియ్యం కోసం ఎగబడడంతో సూపర్ మార్కెట్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టోర్ల ముందు ఎన్నారైలు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ సూపర్ మార్కెట్ల బాట పట్టారు ఎన్నారైలు. అమెరికాలో గతంలో ఒక రైస్ బ్యాగ్ 22 డాలర్లు ఉంటే.. ఇప్పుడు 32-47 డాలర్ల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్టోర్లలో ఒకరికి ఒకటే బ్యాగ్ అమ్ముతుండగా.. మరికొన్నింటిలో 5 బ్యాగులు.. ఇంకొన్నింటిలో అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. భారతీయుల దెబ్బకు అమెరికాలో బియ్యం స్టోర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి

బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడమే ఎన్నారైల భయాందోళనకు కారణం. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో మనదేశానిదే అగ్రస్థానం. దేశంలో ధరలు తగ్గించి, నిల్వలను పెంచడానికి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎగుమతులపై నిషేధం వల్ల బంగ్లాదేశ్, నేపాల్ ఇబ్బంది పడుతున్నాయి

Updated : 22 July 2023 10:59 AM IST
Tags:    
Next Story
Share it
Top