Home > అంతర్జాతీయం > అది నర్సా...రాక్షసా...అన్యాయంగా పిల్లలను పొట్టనపెట్టుకుంది

అది నర్సా...రాక్షసా...అన్యాయంగా పిల్లలను పొట్టనపెట్టుకుంది

అది నర్సా...రాక్షసా...అన్యాయంగా పిల్లలను పొట్టనపెట్టుకుంది
X

ఆసుపత్రిల్లో నర్సులంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది. జీతం తీసుకునే పని చేస్తారు. కానీ ఎంతో ఓపికగా రోగులకు సేవ చేస్తారు. వారు చేసిన దానికి ఎంతిచ్చినా పరిపోదు. కానీ కొంతమంది ఉంటారు. దేవతల్లో దెయ్యాలు. ఆప్పుడు మనం చెప్పుకోబోయే నర్సు కూడా అలాంటిదే. అన్యాయంగా ఏడుగురు పిల్లలను పొట్టపెట్టకుంది.

ఇంగ్లాండ్ లోని అప్పుడే పుట్టిన పిల్లలు ఏడుగురు చనిపోయారు. జాగ్రత్తగా చూసుకోవాల్సన నర్సే తన చేతులతో చంపేసింది. అది కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా. మొదటి నుంచి ఈమె మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు భారత సంతతికి చెందిన వైద్యుడు రవి జయరాం. 2015 నుంచి 2018 వరకు మొత్తం ఏడుగురు పిల్లలను చంపేసింది లూసీ లెబ్టీ అనే నర్సు. రవి జయరాం..లూసీని మొదట్లోనే అనుమానించారు. కంప్లైంట్ కూడా చేశారు. కానీ అతని మాటలను ఎవ్వరూ నమ్మలేదు. చివరకు రవి చెప్పినదే నిజమైంది.

శిశువుల వార్డు ముందు నుంచి వెళుతుండగా లూసీ ఇంక్యుబేటర్ ముందు నిల్చుని కనిపించింది. ఎందుకో అది సహజంగా అనిపించలేదు. అప్పుడే అనుమానమొచ్చి...ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్స్ కు చెప్పాను. కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు. పైగా సహోద్యోగి మీద ఇలా ఆరోపణలు చేయడం మంచిది కాదు, క్షమాపణలు చెప్పమన్నారని తెలిపారు రవిజయరాం. అధికారుల బలవంతంతో క్షమాపణ నోట్ కూడా రాసానని చెప్పారు. అప్పుడే మా కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుని ఉంటే కొంతమంది పిల్లలను అయినా రక్షించగలిగేవాళ్ళమని అంటున్నారు.

2017 వరకు లూసీ మీద కంప్లైంట్ చేయడానికి నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనమతించలేదని చెప్పారు రవి. అప్పుడు మేము వెళ్ళి పోలీసుకు చెప్పాం. వాళ్ళు చాలా తొందరగా పరిస్థితి అర్ధం చేసుకున్నారు. వెంటనే విచారణ ప్రారంభించారు. లూసీని అరెస్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు. లూసీ ఎప్పుడూ నవజాత శిశువుల వార్డులో విధులు నిర్వహించేది. అక్కడ ఇంజెక్షన్ తో శిశుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాలతో వాళ్ళ కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా, అవసరమైన దాని కన్నా ఎక్కువ పంపించడం ద్వారా పిల్లలను చంపేది. మొత్తం 13 మందికి ఇలా చేసింది. ఇందులో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురు మాత్రం ప్రాణాలతో పోరాడి బతికారు. చివరకు 2018లో లూసీని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెనె నేరస్థురాలిగా తేల్చారు. ఆమెకు వేసే శిక్ష ఏంటో త్వరలోనే ఖరారు కానుంది.

Updated : 19 Aug 2023 9:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top