Home > అంతర్జాతీయం > కెనడాలోని భారతీయులకు గట్టి హెచ్చరిక...

కెనడాలోని భారతీయులకు గట్టి హెచ్చరిక...

కెనడాలోని భారతీయులకు గట్టి హెచ్చరిక...
X

కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయిన నేపథ్యంలో రెండు దేశాలు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కెనడాలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ భారత పౌరులు, విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు అన్నీ విచారించుకోవాలని కోరింది.

‘‘కెనడాలో భారత వ్యతిరేక అజెండాతో విద్వేషపూరిత నేరాలు ఎక్కువయ్యాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలను నిరసించే భారతీయుతులను, భారత దౌత్యవేత్తను బెదిరిస్తున్నారు. అలాంటి హింసాత్మక ఘటనలు జరిగే చోటుకు అసలు వెళ్లొద్దు’’ అని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. ‘‘అక్కడ మన పౌరుల రక్షణ కోసం మన దౌత్యవేత్తలతో సంప్రదింపులు సాగుతున్నాయి. అభద్రత నెలకొన్న నేపథ్యంలో పౌరులు, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్టావాలోని భారత హైకమిషన్‌లోనూ, టొరంటో, వాంకోవర్‌ లలోని కాన్సులేట్లలోనూ మ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మిమ్మల్ కాంటాక్ట్ కావడానికి ఇది ఉపయోగ పడుతుంది’’ అని అని సూచించింది.

మరోపక్క.. కెనడా కూడా భారత్ వెళ్లే తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి వెళ్లకూడదని ట్రావెల్ అడ్వైజరీ వదిలింది. ‘‘కశ్మీర్‌లో ఎప్పుడేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదుల, మిలిటెంట్ల ముప్పు పొంచి ఉంది. ప్రజాందోళనలు, కిడ్నాపులు జరిగే అవకాశం ఉంది. లద్దాఖ్‌లో ఆ పరిస్థితి లేదు’’ అని తెలిపింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడంతో రుడు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా తమ దేశంలోని భారత రాయబారిని ఇంటికి పంపగా, ఢిల్లీలోని ఆ దేశ రాయబారిని భారత్ బహిష్కరించింది. నిజ్జర్ హత్య, ఉద్రికత్తల నేపథ్యంలో కెనడాలోని భారతీయులపై సిక్కు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Updated : 20 Sep 2023 10:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top