56 కి.మీ.లు నిలువునా చీలిన భూమి..ప్రళయానికి ఇది సంకేతమా?
X
వాతావరణంలో మార్పులతో పాటు భూమిపైన అత్యంత వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సకల జీవజాతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
లేటెస్టుగా ఆఫ్రియాలో మునుపెన్నడూ చూడని విధంగా భూమికి భారీ పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆఫ్రికాలో మార్చి నెలలో భూమి పగుళ్లు కనిపించాయి. పగుళ్లు ఏర్పడిన చోట భూమి రెండుగా చీలిపోయింది. జూన్ నాటికి ఈ పగుళ్లు మరింతగా విస్తరించాయి. దాదాపు 56 కి.మీ.ల మేరకు పగుళ్లు విస్తరించడంతో స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
లండన్‌కు చెందిన జియోలాజికల్ సొసైటీ ప్రకారం రెడ్ సీ నుంచి మోజాంబిక్ వరకు దాదాపు 35 కి.మీ.ల మేర పొడవైన పర్వతశ్రేణులున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో వాతావరణ త్వరగా మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆఫ్రికా రెండుగా చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా రెండు ఖండాలుగా చీలితే మధ్య నుంచి మహాసాగరం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు టెక్టోనిక్ ప్లేట్‌లను స్టడీ చేస్తున్నారు.
నాసా కూడా ఆఫ్రికాపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆఫ్రికాలో తాజా పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోవడాన్ని గుర్తించింది. భూమి పగుళ్ల ప్రక్రియ ఆఫ్రికాలో కొనసాగుతుందని భవిష్యత్తులో పెనుముప్పు తప్పదని కాలిపోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ అమెరిటస్ కెన్ తెలిపారు.