Home > అంతర్జాతీయం > Israel: ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం.. 5వేల రాకెట్లతో భీకర దాడులు

Israel: ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం.. 5వేల రాకెట్లతో భీకర దాడులు

Israel: ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం.. 5వేల రాకెట్లతో భీకర దాడులు
X

ఇజ్రాయెల్‌ - పాలస్తీనా మధ్య యుద్దం నెలకొంది. ఇజ్రాయెల్పై ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ 5వేలపైగా రాకెట్లతో భీకర దాడికి దిగింది. గాజా స్ట్రిప్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. అదేవిధంగా యుద్ధ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తంగా చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ సైనికుల దాడిలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్పై సైనికులు ఆపరేషన్ను ప్రారభించామని వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ‘ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ ఈ ఆపరేషన్ చేపట్టామని.. ఈ ఉదయం ఇజ్రాయెల్ పై 5వేలకు పైగా మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్​ అరాచకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం. పాలస్తీనావాసులు ఎక్కడున్నా సరే బయటకు వచ్చి పోరాడండి’’ అని డెయిఫ్ పిలుపునిచ్చాడు.

మరోవైపు పెద్ద సంఖ్యలో హమాస్ సైనికులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ సైనికులు సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ - హమాస్ సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అయితే పలువురు ఇజ్రాయెల్ వాసులను హమాస్ బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ దాడులకు హమాస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Updated : 7 Oct 2023 9:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top