Home > అంతర్జాతీయం > Israel-Palestine War: ఇజ్రాయెల్‌- పాలస్తీనా యుద్ధం: 1000 మందికి పైగా మృతి

Israel-Palestine War: ఇజ్రాయెల్‌- పాలస్తీనా యుద్ధం: 1000 మందికి పైగా మృతి

Israel-Palestine War: ఇజ్రాయెల్‌- పాలస్తీనా యుద్ధం: 1000 మందికి పైగా మృతి
X

ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థ తీవ్ర దాడులకు తెగబడుతోంది. యుద్ధం నేపథ్యంలో ఇరు వైపులా 1000 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. హమాస్‌ మిలిటెంట్లు గాజా స్ట్రిప్‌ నుంచి 5వేల రాకెట్లను ప్రయోగించారు. బుల్డోజర్లతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆపరేషన్ 'అల్-అక్సా ఫ్లడ్'తో హమాస్ ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ 'స్వార్డ్స్ ఆఫ్ ఐరన్'తో ప్రతీకారం చర్యలకు దిగింది. హమాస్‌ దాడుల కారణంగా ఇరుదేశాలకి చెందిన 1100 మంది మరణించగా.. వేలాది మంది గాయాలపాలయ్యారు. శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.





ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేశారని, పౌరులను హతమార్చారని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి దిగారని.. అప్రమత్తమైన తమ సైన్యం.. వారితో వీరోచితంగా పోరాడుతోందని చెప్పారు. గాజాలో హమాస్ తీవ్రవాదుల కార్యాలయమైన 14 అంతస్థుల భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక సేనలు కూల్చివేశారు. ఈ దాడుల్లో భారీ భవనం పేక మేడలా నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. అక్కడి నుంచి అమాయక ప్రజలు వెళ్లిపోవాలని ఆ భవనంపై దాడులకు ముందు ఇజ్రాయెల్ 10 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.





మరో వైపు హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియోహ్‌ మాట్లాడుతూ తమ గ్రూప్‌ విజయం అంచున ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.గాజా నుంచి పెద్ద ఎత్తున రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్‌ ప్రజలు పరిస్థితి దారుణంగా మారింది. బందీలుగా ఉన్న అనేకమంది ఇజ్రాయెలీల చిత్రాలను హమాస్‌ విడుదల చేసింది. హమాస్‌ దాడి కారణంగా గాజా సమీపంలోని ఇజ్రాయెల్‌ పట్టణంలోని వీధుల్లో పరిస్థితి భయానంకంగా ఉంది. మృతదేహాలు వీధుల్లో చిందరవందరగా పడి ఉన్నాయి. రోడ్లపై కార్లు ధ్వంసమై కనిపించాయి. హమాస్‌ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా అమానవీయంగా దాడులకు తెగబడిందని, ఘోరమైన తప్పు చేస్తున్నట్లు వారు త్వరలోనే గ్రహిస్తారని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఓ వీడియో ప్రకటన ద్వారా హమాస్‌ను హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌పై దాడులను అమెరికా ఖండించింది. తాము ఇజ్రాయెల్‌కు మద్దతిస్తామని, కావాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదంగా ఆయన పేర్కొన్నారు. తనను, తన ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఈ పరిస్థితో ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్‌తో శత్రుత్వం ఉన్న వారు ప్రయత్నించొద్దంటూ అమెరికా హెచ్చరించింది. ఐరాస భద్రతామండలి కూడా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. భారత్‌, యూకే, జర్మనీ సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.




Updated : 9 Oct 2023 4:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top