Home > అంతర్జాతీయం > జంతువులుగా మారుతున్న జపానీయులు..మొన్న కుక్క, ఇవాళ తోడేలు..

జంతువులుగా మారుతున్న జపానీయులు..మొన్న కుక్క, ఇవాళ తోడేలు..

జంతువులుగా మారుతున్న జపానీయులు..మొన్న కుక్క, ఇవాళ తోడేలు..
X

మనిషి కోరికలు అంతులేనివి. కొందరికి ఒక్కోసారి విచిత్ర కోరికలు కలుగుతుంటాయి. అవి వింటే ఇదేం పైత్యం రా బాబు అనుకుంటాం. జపాన్లోని ఓ వ్యక్తి ఇప్పటికే కుక్కలా మారి వీధుల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే. అదే దేశంలో మరో వ్యక్తి తోడేలులా మారాడు. దీనికోసం ఏకంగా దీన్ని కోసం 20లక్షలు ఖర్చు పెట్టాడు. అచ్చం తోడేలులా మారిపోయాడు.

జపాన్‌కు చెందిన టొరు ఉయెడా అనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి తోడేలులా మారిపోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. ఆ కలను సాకారం చేసుకునేందుకు టీవీ షోలకు దుస్తులు రెడీ చేసే జెప్పెట్ ఏజెన్సీని సంప్రదించాడు. 20 లక్షలకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 7వారాల్లో తోడేలు కాస్ట్యూమ్ను రెడీ చేసింది.

ఆ సూట్ వేసుకుని టోరు తోడేలులా మారిపోయాడు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అది వేసుకుంటానని అతడు చెబుతున్నాడు. ఇంట్లో వీలుచిక్కినప్పుడల్లా తోడేలులా మారిపోయి.. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, బాధలన్నీ మరచిపోతున్నట్లు టోరు చెబుతున్నాడు. ఈ లోకంతో సంబంధం లేన్నట్టుగా భావిస్తానని వివరించాడు.

కుక్కల మారిన టోకో..

జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి కుక్కగా మారిపోవాలన్న కోరిక కలిగింది. ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క కోలీగా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం టీవీ షోలకు దుస్తులు రెడీ చేసే జెప్పేట్తో 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సంస్థ 40 రోజుల్లో కోలీ కాస్ట్యూమ్ను రెడీ చేయగా.. టోకో అది వేసుకుని కుక్లా మారిపోయాడు. హావభావాలు కూడా అలాగే ప్రదర్శిస్తూ.. జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.



Updated : 1 Aug 2023 11:27 AM IST
Tags:    
Next Story
Share it
Top