Home > అంతర్జాతీయం > అమెరికా అధ్యక్షుడిని కిందపడేసిన ఇసుక బస్తా..

అమెరికా అధ్యక్షుడిని కిందపడేసిన ఇసుక బస్తా..

అమెరికా అధ్యక్షుడిని కిందపడేసిన ఇసుక బస్తా..
X

ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడు.. కానీ తన చేష్టలతో నవ్వులపాలవుతుంటారు. ఒకరికి ఇచ్చే షేక్ హ్యాండ్ మరొకరికి ఇవ్వడం, ఒకవైపు వెళ్లాల్సింది మరోవైపు వెళ్లడం, ఉన్నట్లుండి కిందపడిపోవడం వంటి వాటితో బైడెన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాడు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వీడియో వైరల్గా మారింది.

కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్‌ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన బైడెన్‌.. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తుళ్లి ముందుకు పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ని పైకి లేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లతో కలిసి ఆయన కూడా చిరునవ్వులు చిందించారు. 80 ఏళ్ల బైడెన్‌ క్షేమంగానే ఉన్నట్లు వైట్‌ హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ బెన్‌ లాబోల్ట్‌ ట్వీట్‌ చేశారు. స్టేజ్పై నల్లటి ఇసుక బస్తా తగిలి పడిపోయినట్లు వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బైడెన్‌ కిందపడిపోయిన ఘటనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. బైడెన్‌కి మానసికంగానే అన్ ఫిట్ కాదని.. శారీరకంగా కూడా అన్ ఫిట్ గా ఉన్నారని అన్నారు. ‘‘బైడెన్కు నడవడం కూడా కష్టంగా ఉంది. అమెరికన్ల రక్షణ కోసం పార్లమెంట్‌ అధ్యక్ష స్థానాన్ని మరొకరితో భర్తీ చేయించే అంశాన్ని తెర మీదకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Updated : 2 Jun 2023 8:19 PM IST
Tags:    
Next Story
Share it
Top