Home > అంతర్జాతీయం > ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్న మహిళా జడ్జిపై నిందితుడి దాడి

ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్న మహిళా జడ్జిపై నిందితుడి దాడి

ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్న మహిళా జడ్జిపై నిందితుడి దాడి
X

ఆరడుగుల ఎత్తు, భారీకాయం గల ఓ నిందితుడు.. అమాంతం ఓ మహిళా న్యాయమూర్తి మీదకు దూకాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేయబోయాడు. ఇదంతా కోర్టులోనే అంతా చూస్తుండగా సెకన్ల వ్యవధిలో జరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మహిళ జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన ఆ నిందితుడు.. పరుగు పరుగున వచ్చి ఆమెపై దూకి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

బ్యాటరీలు దొంగతనం చేసిన కేసులో డెయోబ్రా రెడ్డెన్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతడు చేసిన నేరానికి గానూ కోర్టులో హాజరుపరచగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా జడ్జ్ అతడికి శిక్షను విధిస్తున్న సమయంలో కోపంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న న్యాయమూర్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తి కిందకి పడిపోయింది. ఇక, ఆమెకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమతమై వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Updated : 4 Jan 2024 12:57 PM IST
Tags:    
Next Story
Share it
Top