ట్విట్టర్కు ఝలక్.. రూ. 50 లక్షల ఫైన్
X
సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఎప్పటికప్పుడు వాటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ను మార్చుతుంటాయి. వాటిలో వచ్చే అభ్యంతరకర కామెంట్స్ ను తొలగిస్తుంటాయి. అయినా అప్పుడప్పుడు కొన్నింటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు భారీ జరిమానా పడింది. అభ్యంతరకర కామెంట్లను నిరోధించడం, వాటిని తొలగించాలని పేర్కొంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అదేశాలను సవాలు చేస్తూ.. ట్విట్టర్ వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్ట్ కొట్టేసింది. ట్విట్టర్ వేసిన పిటిషన్ కు ఎలాంటి అర్హత లేదని.. రూ. 50 లక్షల జరిమానా విధించింది.
ట్విట్టర్ అకౌంట్లను, ట్వీట్టను బ్లాక్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందనే వాదనను.. హైకోర్ట్ ఏకీభవించింది. ట్విట్టర్ కు విధించిన ఫైన్ ను 45 రోజుల్లోగా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఫైన్ కట్టడంలో 45 దాటితే.. రోజుకు రూ. 5వేల చొప్పున అదనంగా చెల్లించాలని తెలిపింది.