హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఖలిస్తాన్ హెచ్చరిక
X
ఓ నేరస్తుడి హత్యతో మొదలైన వివాదం రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. వేలమంది భారతీయుల్లో గుబులు రేపుతోంది. కెనడాలోని హిందువులు వెంటనే ఆ దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. తాము కెనడాకు విధేయులుగా ఉండామని, అలా ఉండని హిందువులు వెంటనే దేశం వెంటనే వెళ్లిపోవాలని నిషేదిత ఖలిస్తాన్ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియో వదిలాడు.
వచ్చేనెల 29న వాంకోవర్‌లో సిక్కులందరూ సమావేశమై కార్యాచరణకు ఉపక్రమించాలని పిలుపునిచ్చాడు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పన్నూన్ హెచ్చరించాడు. ‘‘కెనడా హిందువులు మా కెనడా దేశ రాజ్యాంగాన్ని విధేయత చూపడం లేదు. మీ గమ్యం భారతదేశం కాబట్టి కెనడాను విడిచిపెట్టి వెళ్లండి. ఖలిస్తాన్ మద్దతుదారులం కెనడా రాజ్యాంగానికి విధేయంగా ఉంటాం’’ అని పన్నూన్ అన్నాడు. అక్టోబర్ 29న వాంకోవర్ జరిగే సమావేశంలో నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని జరిపే రిఫరెండంలో పాల్గొనాని కోరాడు.