Charles III : బ్రిటన్ రాజుకు క్యాన్సర్..
X
బ్రిటన్ రాజుకు క్యాన్సర్ సోకింది. 75 ఏళ్ల చార్లెస్-3 క్యాన్సర్ బారినపడినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన క్యాన్సరో వివరించలేదు. కొన్ని రోజుల క్రితం రాజు అస్వస్థతకు గురయ్యారు. ప్రొస్టేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేస్తుండగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే ఇది ప్రొస్టేట్ గ్రంధి క్యాన్సర్ కాదు. చికిత్సతో త్వరగా కోలుకుని ఆయన తిరిగి తన విధులను నిర్వర్తిస్తారు’’ అని బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది.
ప్రస్తుతం బహిరంగ కార్యక్రమాలకు రాజు దూరంగా ఉంటున్నారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. సీనియర్ రాజకుంటుంబీకులు ఆయన కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఛార్లెస్ -3 త్వరగా కోలుకోంటారనడంతో ఎలాంటి సందేహం లేదని రిషి సునాక్ అన్నారు. ‘‘మీరు త్వరగా కోలుకోవాలి. మీకోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది’’ అని రిషి సునాక్ ట్వీట్ చేశారు. అదేవిధంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ - 2 మరణం తరువాత ఆమె కుమారుడు ఛార్లెస్-3 2022 మేలో సింహాసనాన్ని అధిష్ఠించారు.