Home > అంతర్జాతీయం > ఆకాశం నుంచి ఇంటిపైన పడ్డ 10 కేజీల మంచుగడ్డ.. సరిగ్గా...

ఆకాశం నుంచి ఇంటిపైన పడ్డ 10 కేజీల మంచుగడ్డ.. సరిగ్గా...

ఆకాశం నుంచి ఇంటిపైన పడ్డ 10 కేజీల మంచుగడ్డ.. సరిగ్గా...
X

వడగళ్ల వానలతో జరిగే నష్టమొంతో మనకు తెలుసు. పంటలు నాశనమవుతాయి. పూరిళ్ల దెబ్బతింటాయి. బయటికి వెళ్తే తలలు పగలగొడతాయి. ఎంత వడగళ్లయినా బరువు కొన్ని గ్రాముల నుంచి మహా అయిత యాభై, వంద, రెండు వందల గ్రాములకు మించదు. కానీ ఓ ఏకంగా 10 కేజీల బరువైన మంచుగడ్డ పడింది. అదికూడా రోడ్డుమీదో, పొలాల్లోనో, సముద్రాల్లో కాకుండా ఇంకెక్కడా చోటు లేనట్లు ఓ ఇంటిపైన పడింది. అది కూడా 300 ఏళ్ల నాటి ఇల్లు. వందల అడుగుల ఎత్తనుంచి పడడంతో కప్పుకు పిడుగుపాటు పెద్ద రంధ్రం పడింది. అదృష్టవశాత్తూ ఆ స్పాట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

అమెరికాలోని మాసాచుషెట్స్ రాష్ట్రంలోని షిర్లీ పట్టణంలో ఆదివారం పడిందీ మంచుగడ్డ. జెఫ్ ఇల్గ్ అనే వ్యక్తి 18వ శతాబ్దంలో కట్టిన ఇంటికి మరమ్మతులు చేసుకుని అందులోనే ఉంటుంది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందని బయటికి వచ్చిన చూడగా పెరట్లో భారీ మంచుగడ్డ పడింది. తర్వాత ఇంటి కప్పుకు పడిన రంధ్రాన్ని చూశారు. తన జీవితం అంత పెద్ద హిమశకలాన్ని చూడడం ఇదే మొదటిసారి అని జెఫ్ చెప్పాడు. ఇది నిజంగా వర్షం వల్ల పడిందా లేకపోతే ఆకాశంలో వెళ్లే విమానాలు నుంచి, హెలికాప్టర్ల నుంచి పడిందా అనే సందేహం ఉందని, ఇంటి బీమా కంపెనీకి విషయ చెప్పానని తెలిపాడు. బోస్టన్ లోగాన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే విమానం నుంచి ఇది పడి ఉంటుందని భావిస్తున్నానన్నాడు.

Updated : 20 Aug 2023 12:46 PM IST
Tags:    
Next Story
Share it
Top