Home > అంతర్జాతీయం > భార్యపై కోపంతో బార్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

భార్యపై కోపంతో బార్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి

భార్యపై కోపంతో బార్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి
X

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో ప్రముఖ బైకర్స్‌ బార్‌ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. నిందితుడు రిటైర్డ్‌ పోలీసు అధికారి అని సమాచారం. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.





ట్రాబుకో కాన్యన్‌లోని కుక్స్ కార్నర్ అని పిలువబడే బైకర్స్ బార్‌లో ఈ కాల్పులు జరిగాయి.రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బార్‌లో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. స్థానిక కేసీఏఎల్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగ్గా.. నిందితుడు సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.




Updated : 24 Aug 2023 10:46 AM IST
Tags:    
Next Story
Share it
Top