Home > అంతర్జాతీయం > అమెరికాలో మరోసారి కాల్పులు మోత.. ముగ్గురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు మోత.. ముగ్గురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు మోత.. ముగ్గురి మృతి
X

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో నార్త్‌వెస్ట్‌లోని నైట్‌లైఫ్ ప్రాంతంలో గుడ్‌హోప్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. నలుగురికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఒక మహిళ సహా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గుర్తుతెలియని నిందితుడ్ని పట్టుకొనే ప్రయత్నం చేశారు.

ఈ విషయంపై స్థానిక పోలీసు అధికారి పమేలా స్మిత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుందని, వారిని భయాందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. గాయపడిన వారినిచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితుడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుంది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం అక్కడి ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. వాషింగ్టన్‌లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 మందికిపైగా కాల్పుల ఘటనల్లో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల తరువాత అధిక సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఆగస్టు నెలలోనే మొదటి ఐదు రోజుల్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనల్లో డజను మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

Updated : 6 Aug 2023 9:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top