ఎలన్ మస్క్ ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న జుకర్ బర్గ్
X
మైక్రో బ్లాగింగ్ లో ఇప్పటి వరకు ట్విట్టర్ ను ఏదీ ఢీ కొట్టలేకపోయింది. దీనికి పోటీగా బ్లూ స్కై, మాప్టోడాన్ లాంటివి ఎప్పటి నుంచో ఉన్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్ వచ్చేస్తోంది. ఫైస్ బుక్, వాట్సాప్ లాంటి మోస్ట్ ఫేమస్ యాప్ లను రన్ చేస్తున్న మెటా దీనిని ప్రవేశపెడుతోంది.
ట్విట్టర్ బాగా ఫేమస్. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ దీనికి చాలా బాగా అలవాటు పడిపోయారు. అయితే ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతిలోకి వచ్చిన తర్వాత బోలెడు మార్పులు జరిగాయి. తాజాగా యూజర్లు చూసే ట్వీట్లు మద కూడా మస్క్ ఆంక్షలు విధించాడు. దీని మీద యూజర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది ట్విట్టర్ ను వదిలేసి మిగతా యాప్ ను యూజ్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే మరో కొత్త మైక్రో బ్లాగింగ్ యాప్ రంగంలోకి దిగుతోంది. అది కూడా మెటా సంస్థ నుంచి. థ్రెడ్ పేరుతో విడుదల అవనున్న ఈ యాప్ ట్విట్టర్ కు గట్టి పోటీనే ఇస్తుందని టాక్ వినబడుతోంది.
థ్రెడ్ యాప్ వివరాలను మరో రెండు రోజుల్లో అంటే జులై 6 న విడుదల చేయనున్నారు. యాప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ లలో దీని వివరాలు మాత్రం తెలుసుకోవచ్చును. యాప్ విడుదల తర్వాత ఇన్ట్సా గ్రామ్ యూజర్లు వారి ఐడీతో థ్రెడ్ ను లాగిన్ అవ్వొచ్చు. థ్రెడ్ కోసం డీ సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ సంస్థ యాక్టివిటీపబ్ తో మెటా చేతులు కలిపింది. వెబ్ సర్వర్ లకు, బ్రౌజర్లు థ్రెడ్ యాప్ ఇంటర్ ఫేస్ కు అనుసంధానం చేసేలా ఉంటుంది. థ్రెడ్ ఇంటర్నల్ కోడ్ నేమ్ ప్రాజెక్ట్ 92 అని సమాచారం.