Home > అంతర్జాతీయం > మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా
X

ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ధృవీకరిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మైక్రోసాఫ్ట్ నుంచి అనంత్ బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భారత్ లో కంపెనీ ఎదుగుదలకు కృషి చేసిన అనంత్ కు కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్తులో చేసే ప్రతి ప్రయత్నం నెరవేరాలని కోరుకుంటున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఐరినా ఘోస్ ను.. మైక్రోసాఫ్ట్ ఇండియా విభాగం ఎండీగా నియమిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న శశి శ్రీధరన్ ను సంస్థలో మరో ముఖ్య పదవి అప్పడించే అవకాశం ఉంది. 2016లో మైక్రోసాఫ్ట్ లో చేరిన అనంత్.. అంతకు ముందు హనీవెల్, మెకిన్సే కంపెనీల్లో పనిచేశారు.

Updated : 8 July 2023 8:28 AM IST
Tags:    
Next Story
Share it
Top