Home > అంతర్జాతీయం > వైట్ హౌజ్‏లో మోదీకి విందు..మెనూలో చిరుధాన్యాల వంటకాలు

వైట్ హౌజ్‏లో మోదీకి విందు..మెనూలో చిరుధాన్యాల వంటకాలు

వైట్ హౌజ్‏లో మోదీకి విందు..మెనూలో చిరుధాన్యాల వంటకాలు
X

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. వైట్ హౌస్‎కు చేరుకున్న ప్రధానికి బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. ఆ తర్వాత బైడెన్ తో మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం, ఇండో ఫసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ప్రాస్పరిటీ వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం మోదీ కోసం వైట్ హౌజ్‎లో అధికారిక విందును ఏర్పాటు చేశారు. మోదీకి అందంచే విందులో చిరుధాన్యాల వంటకాలను చేర్చారు. ఈ మెనూ ప్రిపేర్ చేసే బాధ్యతలను అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌ ఓ స్పెషల్‌ చెఫ్‌కు అప్పజెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్స్‎ను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలకు జిల్‌ బైడెన్‌ కూడా మద్దతు తెలిపారు. ఇవాళ వైట్ హౌజ్‎లో మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‎లో చిరుధాన్యాలతో తయారు చేసిన రుచికరమైన వంటకాలను కూడా చేర్చారు. ఈ అధికారిక విందుకు సంబంధించిన ఐటమ్స్‎ను వైట్ హౌజ్ పేస్ట్రీ చెఫ్‌ సుసీ మారిసన్‌ ప్రిపేర్ చేయనున్నారు. ఈ విందులోని వంటకాల లిస్టు తెలిస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. వెజ్‎లో ఎన్నో రకాల వెరైటీలను రూపొందిస్తున్నారు.

ఈ అధికారిక విందులో ఫస్ట్‌కోర్స్‌లో భాగంగా.. మారినేటెడ్‌ మిల్లెట్‌, గ్రిల్డ్‌ కార్న్‌ కెర్నల్‌ సలాడ్‌, వాటర్ మిలన్, అవకాడో సాస్‌ అందిస్తారు. అనంతరం మెయిన్‌ కోర్స్‌లో స్టఫ్డ్‌ పోర్టబెల్లో మష్రూమ్స్‌, కుంకుమ పువ్వుతో తయారు చేసిన రిసోటో, లెమెన్‌ దిల్‌ యోగర్ట్‌ సాస్‌, క్రిస్ప్‌డ్‌ మిల్లెట్‌ కేక్స్‌, సమ్మర్ డ్రింక్స్ వంటి ఐటమ్స్ ఉండనున్నాయి. భారత త్రివర్ణ పతాకాన్ని సూచించే డెకర్‎తో , విందులో భారతీయ టచ్ ఉంటుందని భావిస్తున్నారు.











Updated : 22 Jun 2023 1:49 PM IST
Tags:    
Next Story
Share it
Top