Home > అంతర్జాతీయం > మరో అద్బుతానికి తెర తీస్తున్న దుబాయ్

మరో అద్బుతానికి తెర తీస్తున్న దుబాయ్

మరో అద్బుతానికి తెర తీస్తున్న దుబాయ్
X

ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం బుర్జ్ కలీఫా తర్వాత మరో అద్బుతానికి తెరతీస్తోంది దుబాయ్. రిచెస్ట్ కంట్రీగా పేరు పొందిన ఈ దేశంలో అంతే రిచ్ గా ఓ రిసార్ట్ తయారవుతోంది. సాగరం మధ్యలో విలాసవంతమైన ఈ హోటల్ కట్టడం ఇంకా పూర్తవకముందే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.





సౌదీ అరేబియాలో ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా ఒక లగ్జరీ రిసార్ట్ ను నిర్మిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో , సూపర్ టెక్నాలజీతో ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ అక్కడ అత్యంత వేగంగా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ రిసార్ట్ వీడియోను రెడ్ సీ గ్లోబల్ సంస్థ విడుదల చేసింది. దీనిని 2024 కి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

దుబాయ్ కు చెందిన కిల్లా డిజైన్ ఈ రిసార్ట్ డిజైన్ ను తయారు చేశారు. మడ అడవులు, ఎడారి వృక్షాలు, సహజమైన పగడపు దిబ్బల మీద రిఫ్లెక్టివ్ విజువల్ అప్పీల్ ఉండేలా.. దీనిని రూపొందించారు. విభిన్నమైన పర్యావరణ అనుకూలతలతో పాటూ ఆధునిక టెక్నాలజీని దీనికి జోడించారు. మొత్తం రిసార్ట్ అంతా కోరల్స్ మీద ఉండేలా ప్లాన్ చేశారు. LEED-ప్లాటినం భవనానలను నిర్మిస్తున్నారు. ఏరియల్ అకామిడేషన్ పాడ్స్ అని పిలిచే ఈ విల్లాలు సందర్శకులకు సముద్ర గర్భంలో లీనమయ్యే అనుభవన్ని కలిగిస్తాయిట.





మొత్తం రిసార్ట్ ఏరియల్ వ్యూ చూస్తే సముద్ర గుర్రం ఆకారంలో ఉంటుంది. ఇందులో సెంట్రల్ సోలార్ ఫామ్ తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్ ను ఉపయోగిస్తున్నారు. నింగిని, సాగరాన్ని రిఫ్లైక్ట్ చేస్తూ షేబరా ఆర్టస్ నీటి మీద తేలుతాయి. ఇందులో మొత్తం 73 విల్లాలు ఉంటాయి. ఇందులోని హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ కింద ఉన్న కోరల్స్ చాలా అందంగా ఉండి అక్కడ ఉంటున్న వారి మతిపోగతాయని చెబుతోంది రెడ్ సీ కంపెనీ. మొత్తానికి ఇందులో ఉండడం ఒక వింత అనుభవాన్ని కలిగిస్తుందని తెలిపారు.





రిసార్ట్ బయట భాగాన్ని స్టెయిన్ లెస్ స్టీల్ ను ఉపయోగించారు. దీని కోసం దాదాపు 150 టన్నుల స్టీల్ ను వాడారు. ఆర్బ్ లు చూడ్డానికి చాలా యూనిక్ గా కనిపిస్తాయి. ఇంకా పూర్తవకుండానే ఇంత అట్రాక్టివ్ గా ఉంటే మొత్తం అయ్యాక ఇంకెంత బావుటుందో అంటున్నారు వీడియో చూసినవాళ్ళు. ఇదొక మెరైన్ ఫ్యారడైజ్ అంటూ పొగిడేస్తున్నారు. దీని ఫస్ట్ లుక్ మొదట్లో పెద్ద సంచలనమే రేపింది.


Updated : 16 Aug 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top