Home > అంతర్జాతీయం > పాక్లో దారుణం.. క్రైస్తవుల ఇల్లు, చర్చిలు ధ్వంసం.. ఏం జరిగిందంటే..?

పాక్లో దారుణం.. క్రైస్తవుల ఇల్లు, చర్చిలు ధ్వంసం.. ఏం జరిగిందంటే..?

పాక్లో దారుణం.. క్రైస్తవుల ఇల్లు, చర్చిలు ధ్వంసం.. ఏం జరిగిందంటే..?
X

పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అడుగంటిన రిజర్వ్డ్ కరెన్సీ, పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఆ దేశం అల్లాడుతుంది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్ జిల్లా(లో మత ఘర్షణలు చెలరేగాయి. ఫైసలాబాద్ జిల్లాలోని జరన్‌ వాలాలో దుండగులు చర్చిలపై దాడులకు తెగబడ్డారు. క్రైస్తవుల ఇళ్లు, చర్చిలను తగులబెడుతూ బీభత్సం సృష్టించారు.

దీంతో పోలీసులు 24 గంటల్లో 600 మందిపై టెర్రర్ కేసులు నమోదు చేశారు. సుమారు

ఫైసలాబాద్‌లోని ఓ క్రైస్తవ కుటుంబం పవిత్ర ఖురాన్‌ను ఉల్లంఘించడంతోపాటు దైవదూషణలకు పాల్పడ్డారనే ప్రచారంతో ఈ దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. సుమారు 5 చర్చిలకు ముస్లీం వర్గీయులు నిప్పు పెట్టారు. అదేవిధంగా కొంతమంది క్రైస్తవుల ఇల్లను సైతం ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగారు. 7రోజుల పాటు 144 సెక్షన్ విధించడంతో పాటు సమావేశాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ ఘర్షణలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ లో దైవదూషణ చేస్తే చట్టపరంగా శిక్షలు ఉంటాయి. కాగా ఆందోళనకారులు చర్చిలు, ఇల్లకు నిప్పుపెట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


Updated : 18 Aug 2023 10:31 AM IST
Tags:    
Next Story
Share it
Top