Home > అంతర్జాతీయం > ఫ్రాన్స్‌ చేరుకున్న మోదీ.. స్వాగతం పలికిన ప్రధాని

ఫ్రాన్స్‌ చేరుకున్న మోదీ.. స్వాగతం పలికిన ప్రధాని

ఫ్రాన్స్‌ చేరుకున్న మోదీ.. స్వాగతం పలికిన ప్రధాని
X

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన ప్యారిస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ - ఫ్రాన్స్‌ల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని చెప్పారు.

ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన వేళ మోదీ ఈ పర్యటన చేపడుతున్నారు. మోదీ తొలుత ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో సమావేశమవుతారు. అనంతరం సెనేట్‌ను సందర్శించి.. సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ అవుతారు. రాత్రి 11 గంటల సమయంలో.. ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ డిన్నర్లో పాల్గొననున్నారు. ఇక మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశ ‘నేషనల్‌ డే’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత త్రివిధ దళాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.



Updated : 13 July 2023 7:40 PM IST
Tags:    
Next Story
Share it
Top