Home > అంతర్జాతీయం > కిందపడ్డ జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో వేసుకున్న మోదీ

కిందపడ్డ జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో వేసుకున్న మోదీ

కిందపడ్డ జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో వేసుకున్న మోదీ
X

ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. బ్రిక్స్ సదస్సులో గ్రూప్ ఫొటో సందర్భంగా స్టేజ్ పైకి వెళ్లిన మోదీ.. అక్కడ నేలపై పడున్న భారత జాతీయ పతాకాన్ని చూసి, జాగ్రత్తగా తీసి ఆయన జేబులో వేసుకున్నారు. మోదీ చర్యను గమనించిన సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ జెండాను తీసి అక్కడున్న సిబ్బందికి అందించారు. సిబ్బంది మోదీని కూడా జెండా తమకు ఇవ్వాలని కోరగా.. దాన్ని మోదీ ‘పర్లేదు నాదగ్గరే ఉంచుకుంటానంటూ’ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఈ ఘటన మోదీ నాయకత్వ నిలకడకు, దేశంపై, జాతీయ జెండాపై ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం (ఆగస్ట్ 22) సౌతాఫ్రికా చేరుకున్నారు. జోహన్సెస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ మీటింగ్ లో ప్రసంగించిన మోదీ.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. త్వరలో భారత్ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.

Updated : 23 Aug 2023 11:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top