Home > అంతర్జాతీయం > Israel : చల్లారని యుద్ధం..ప్రాణాలొదులుతున్న సామాన్యులు!

Israel : చల్లారని యుద్ధం..ప్రాణాలొదులుతున్న సామాన్యులు!

Israel : చల్లారని యుద్ధం..ప్రాణాలొదులుతున్న సామాన్యులు!
X

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. హమాస్ అంతాన్ని చూసే వరకూ ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటానని ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదిన హమాస్ ఆర్మీ ఇజ్రాయెల్ ప్రాంతంపై దాడి చేసింది. అందులో 1200 మంది ప్రాణాలొదిలారు. ఇక అప్పటి నుంచి ఈ యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్టీనా భూభాగాలు అయిన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకుపై దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు.





ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది సామాన్యులు ప్రాణాలొదిలారు. హమాస్ చేసిన నేరానికి పాలస్తీనా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ యుద్ధంలో 28,064 మంది మరణించినట్లు గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 117 మంది చనిపోయినట్లు తెలిపింది. ఇకపోతే యుద్ధం వల్ల 67,611 మంది గాయాలపాలైనట్లు ప్రకటించింది. యుద్ధం ఆగకపోతే మరణాల సంఖ్య రెట్టింపు కానుంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ ఆర్మీలను శాంతింపజేసే చర్యలను పలు దేశాలు చేపడుతున్నాయి.


Updated : 11 Feb 2024 7:17 PM IST
Tags:    
Next Story
Share it
Top