Home > అంతర్జాతీయం > లిబియాలో జలవిలయం.. 5వేల మందికి పైగా మృతి..

లిబియాలో జలవిలయం.. 5వేల మందికి పైగా మృతి..

లిబియాలో జలవిలయం.. 5వేల మందికి పైగా మృతి..
X

డేనియల్ తుఫాన్ విధ్వంసానికి లిబియా విలవిలలాడుతోంది. శిథిలమైన బిల్డింగులు, చెదిరిపోయిన బతుకులతో డెర్నా నగరం అల్లాడుతోంది. భారీ వర్షాలకు డెర్నా సమీపంలో ఉన్న రెండు డ్యాంలు బద్దలవడంతో నగరాన్ని వరద ముంచెత్తింది. ఈ వరదతో 5వేల మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 2వేల మృతదేహాలను వెలికితీశారు. సుమారు 10వేల మంది గల్లంతయ్యారు.





రెండు ప్రభుత్వాలు..

పాలనా సంక్షోభంతో అట్టుడుకుతున్న లిబియాను డేనియల్ తుఫాన్‌ మరింత ఆగం చేసింది. గడాఫీ గద్దె దిగిన నుంచి అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. అబ్దుల్‌ హమీద్‌ బీబా.. రాజధాని ట్రిపోలి నుంచి పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మరో పెద్ద నగరం బెంఘాజీ నుంచి ఒసామా హమద్ పాలిస్తున్నారు. దేశ తూర్పు ప్రాంతం ఈయన నేతృత్వంలో ఉంది. ఒసామాకు శక్తివంతమైన మిలిటరీ కమాండర్ ఖలిఫా హిఫ్తార్ మద్దతు ఉంది. ఇలా ఒకే దేశాన్ని ఇద్దరు ప్రధానులు పాలిస్తున్నారు.





రెండు ప్రభుత్వాలు ఉండడంతో సహయాక చర్యలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో వివిధ దేశాలు లిబియాకు అండగా నిలిచాయి. ఈజిప్టు, అల్జీరియా, టర్కీ , యూఏఈ సహా పలు దేశాలు లిబియాకు సహాయక బృందాలను తరలించాయి. అటు ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది.





తుఫాన్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఇంత భారీ ముప్పు తలెత్తిందని లిబియా ఎమర్జెన్సీ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ చీఫ్‌ ఒసామా అల్యా తెలిపారు. సముద్ర మట్టం, వరద, గాలివేగం, వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేకపోయామన్నారు. ఈ స్థాయి ముప్పును గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. తూర్పు తీరంలోని మరిన్ని నగరాలు కూడా ఆకస్మిక వరదలకు వణికిపోయినట్లు చెప్పారు.


Updated : 13 Sept 2023 7:07 PM IST
Tags:    
Next Story
Share it
Top