Home > అంతర్జాతీయం > Morgan Freeman: మోర్గాన్ ఫ్రీమాన్‌కు క్షమాపణలు చెప్పిన బాస్కెట్ బాల్ ఆటగాడు

Morgan Freeman: మోర్గాన్ ఫ్రీమాన్‌కు క్షమాపణలు చెప్పిన బాస్కెట్ బాల్ ఆటగాడు

Morgan Freeman: మోర్గాన్ ఫ్రీమాన్‌కు క్షమాపణలు చెప్పిన బాస్కెట్ బాల్ ఆటగాడు
X

హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ఇటీవల ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ ను వీక్షిస్తున్న సమయంలో ఆబర్న్ ఆటగాణ్ని తాకేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సదరు బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు జానీ బ్రూమ్.. తనను తాకేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక ఆ చేయిని విసురుగా వదిలించాడు. వెనుదిరిగి చూశాక ఆ వ్యక్తి ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ అని గ్రహించి వెంటనే తన పొరపాటు తెలుసుకొని అక్కడే క్షమాపణ చెప్పేశాడు. ఇటీవల రెబల్స్ గేమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జానీ బ్రూమ్ ఓలే మిస్‌తో జరిగిన మ్యాచ్ రెండో అర్ధభాగంలో బౌండ్స్ వెలుపలికి వెళ్లకుండా బంతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో గ్రౌండ్ ముందు వరుసలో నుండి ఎవరో తన జెర్సీని లాగినట్లు గమనించాడు. వెంటనే ఆ చేయిని విదిలించాడు. తిరిగి చూశాక ఆ వ్యక్తి మరెవరో కాదని, మోర్గాన్ ఫ్రీమాన్ అని తెలుసుకొని తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. మోర్గాన్ ఫ్రీమాన్ కూడా జానీ క్షమాపణను అంగీకరించాడు.





మ్యాచ్ ముగిశాక బ్రూమ్ మీడియాతో మాట్లాడుతూ...తాను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మోర్గాన్ సినిమా ఒకటి చూశానని , ఎదురుగా ఉన్న వ్యక్తి ఆయనే అని పోల్చుకునేందుకు క్షణ కాలం సమయం పట్టిందని తెలిపాడు. ఆ సినిమాలో చూసిన ఓ నటుడు, తనకు బాగా నచ్చిన వ్యక్తి మోర్గాన్ అని తెలియగానే... క్షమాపణలు అడిగానని చెప్పాడు. మోర్గాన్ కూడా ఆటను కొనసాగించమని చెప్పారన్నాడు. ఇక ఆ మ్యాచ్ లో ఆబర్న్ తరఫున గేమ్ గెలిచాడు బ్రూమ్.








Updated : 5 Feb 2024 8:12 PM IST
Tags:    
Next Story
Share it
Top