Home > అంతర్జాతీయం > వైట్‌హౌస్‌లో విందు..హాజరైన అంబానీ కపుల్స్

వైట్‌హౌస్‌లో విందు..హాజరైన అంబానీ కపుల్స్

వైట్‌హౌస్‌లో విందు..హాజరైన అంబానీ కపుల్స్
X

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ గౌరవార్థం వైట్ హౌస్‌లో అమెరికాన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ గురువారం రాత్రి స్పెషల్ డిన్నర్‎ను ఏర్పాటు చేశారు. ఈ విందులో భారతదేశానికి చెందిన ప్రముఖులతో పాటు అమెరికాకు చెందిన వారు పాల్గొన్నారు. బడా వ్యపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో కలిసి మోదీ విందును ఆశ్వాదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీలు స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచారు.


ఈ విందుకు దాదాపు 400 మంది గెస్టులను బైడెన్ ఆహ్వానించారు. విందులో అంబానీ దంపతులు, ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కపుల్స్‎తో పాటు,ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇంద్ర నూయి, ఆనంద్ మహీంద్రా, నిఖిల్ కామత్, ఆంటోనీ బ్లింకెన్, శాంతను నారాయణ్, ఎరిక్ గార్సెట్టి, కెవిన్ మెక్‌కార్తీ, సత్య నాదెళ్ల, గినా రైమోండో తదితరులు ఉన్నారు.



అమెరికాను సందర్శించే ఆయా దేశాల అధినేతలను గౌరవించే పద్ధతిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్‎లో ఆనవాయితీగా స్టేట్ డిన్నర్‎ను ఏర్పాటు చేస్తారు. బైడెన్ అధ్యక్షుడు అయ్యాక దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్‌కు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లకు మాత్రమే ఇలాంటి విందు ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విందు ఇవ్వడం ద్వారా భారత్‌కు బైడెన్‌ ఇస్తున్న ప్రాముఖ్యత తెలుస్తోంది. ఇలాంటి లగ్జరీ విందుకు హాజరై అంబానీ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి వీరు విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో వీరి పిక్స్ ఇంటర్నెట్‎లో వైరల్ అవుతున్నాయి.



Updated : 23 Jun 2023 6:15 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top