Home > అంతర్జాతీయం > దిగ్గజాల మధ్య మొదలైన మాటల యుద్ధం

దిగ్గజాల మధ్య మొదలైన మాటల యుద్ధం

దిగ్గజాల మధ్య మొదలైన మాటల యుద్ధం
X

మాటలతో ఒకరినొకరు రఫ్ఫాడించేసుకుంటున్నారు. కేజ్ ఫైట్ కు నువ్వు సిద్ధంగా లేవంటే...నువ్వు లేవని ఆడిపోసుకుంటున్నారు. తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరికి ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ లు.

టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ లు కేజ్ ఫైట్ కన్నా ముందే ఆన్ లైన్ లో గేమ్ ఆడేసుకుంటున్నారు. మస్క్ తనతో కేజ్ ఫైట్ కు డేట్లు ఇవ్వడం లేదని జుకర్ బర్గ్ ఆరోపిస్తుంటే...ఈరోజే. ఇప్పుడే రెడీ అంటున్నారు ఎలాన్ మస్క్. టెస్లా ఓనర్ మస్క్ తనతో ఫైట్ ను తేలిగ్గా తీసుకున్నారని అందుకే తాను ఇక్కడే వదిలేస్తానని జుకర్ బర్గ్ అంటున్నారు. థ్రెడ్ లో దీనికి సంబంధించి పోస్ట్ పెట్టారు. తాను ఇప్పటికే ఓ డేట్ సూచించానని..కానీ మస్క్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. మరోవైపు డాన వైట్ ఈ పోటీని చట్టబద్ధంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. ఏమైనా అడిగితే తన ఇంటికి వచ్చేయ్ ఆడదామంటాడు... కానీ అధికారిక ఈవెంట్ ను మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏమైనా అంటే ఆపరేషన్ అంటారు అంటూ విమర్శించారు. ఆయన సీరియస్ గా తీసుకుంటే నా దగ్గరకు ఎలా రావలో మస్క్ కు బాగా తెలుసుే. తొందరగా కన్ఫార్మ్ చేశారా సరే లేదా నేను మరొకరితో ఫైట్ చేసుకుంటాను అంటున్నారు మార్క్.

థ్రెడ్ లో పోస్ట్ ఎలాన్ మస్క్ దృష్టికి వెళ్ళింది. దానికి ఆయన సమాధానంగా తాను ఈ పోమవారమే జుకర్ బర్గ్ ఇంటికి వెళతానని...అతని ఇంటి తలుపు తట్టేందుకు వేచి ఉండలేనని సమాధానం చెప్పారు. అంతేకాదు జుక్ ఈస్ ఏ చికెన్ అంటూ కామెంట్ కూడా చేశారు. అమెరికాలో చిక్ ఫిల్ ఏ కు మార్క్ వెళ్ళలేరని...ఎందుకంటే తనను తానే తినడం బావుండదు కదా అంటూ కామెంట్స్ చేశారు.

జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ ల మధ్య కేజ్ ఫైట్ ఇటలలీలో నిర్వహించనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఎలాన్ మస్క్ చెప్పారు. దీనికి సంబంధించి అక్కడి ప్రధాని జార్జియా మెలోనీతో మాట్లాడినట్లు కూడా చెప్పారు. ఈ ఫైట్ ఎక్స్, మెటాలలో ప్రసారం అవుతుందని కూడా తెలిపారు. దీనికి సిద్ధమని, ఆగస్టు 26న పెట్టుకుందామని జుకర్ బర్గ్ చెప్పినప్పటికీ ఎలాన్ మస్క్ స్పందించలేదు.




Updated : 14 Aug 2023 12:27 PM IST
Tags:    
Next Story
Share it
Top