Home > అంతర్జాతీయం > మన హీరోలను ప్రపంచం అంతా ప్రేమిస్తోంది

మన హీరోలను ప్రపంచం అంతా ప్రేమిస్తోంది

మన హీరోలను ప్రపంచం అంతా ప్రేమిస్తోంది
X

జపాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి యోషిమాసా హయాషి రెండు రోజుల పర్యటకు ఇండియా వచ్చారు. విలేకర్ల సమావేశం పాల్గొన్నారు. అందులో ఇండియన్ సినిమా గురించి, యాక్టర్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భారతీయ సినిమాలకు తమ దేశంలో మంచి గుర్తింపు ఉందని చెప్పారు యోషిమాసా హయాషి. తాను కూడా చాలా సినిమాలు చూశానని చెప్పారు. ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంలోనే ఆయన ఫేవరెట్ హీరో ఎవరని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామారావు జూనియర్ నా అభిమాన హీరో అంటూ సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ లో ఆయన నటన కట్టిపడేసిందని పొగిడారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచం అంతా మన్ననలు అందుకుంది. జపాన్ లో వందరోజులకు పైగా ఆడి రికార్డులు సృష్టించింది. అక్కడ మన యాక్టర్లు ఎనలేని అభిమానులని సంపాదించిపెట్టింది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ ను తెచ్చింది. జపాన్ లో విడుదలై దాదాపు 120 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు అంచనా. ఇందులో నటించిన రామ్ చరణ్, జూ.ఎన్టీయార్ ఫేమస్ అయిపోయారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని...ఈ సినిమా కథను అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు. రామ్ చరణ్, తారక్ లతోనే ఉంటుందని .....కాకపోతే ఎవరు దర్శకత్వం చేసారనేది ఇంకా తెలియదని చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తామని తెలిపారు.


Updated : 28 July 2023 5:28 PM IST
Tags:    
Next Story
Share it
Top