Japan plane crash: జపాన్ విమానాల ప్రమాదం... నిర్లక్ష్యమే కారణం
X
జపాన్లోని టోక్యో ఎయిర్ పోర్ట్ రన్ వేపై జనవరి 2న జరిగిన విమానాల ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A350 విమానం ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడాలో విమానం రన్ వేపై దిగుతుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న కోస్ట్ గార్డు ఎయిర్ క్రాఫ్టును ఢీకొంది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే విమానం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో కోస్ట్‌గార్డ్ విమానం కెప్టెన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భిన్నమైన కథనాలు చెప్తున్నారు. రన్ వే సిపై ఎయిర్ లైన్స్ విమానం దిగేందుకు ట్రాఫిక్ కంట్రోలర్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదే టైంలో రన్ వేకు దూరంగా ఉండాలని కోస్ట్ గార్డ్ విమానానికి సూచించినట్లు చెప్తున్నారు.
అయితే కోస్ట్ గార్డ్ వర్గాలు మాత్రం దీనిపై భిన్నంగా వాదనలు వినిపిస్తున్నారు. కోస్ట్ గార్డ్ విమానం ఎగిరేందుకు కంట్రోలర్ నుంచి పర్మిషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. కాగా ఈ విమానం భూకంపం వల్ల అతలాకుతలం అయిన నీగట ప్రిఫిక్చెర్ కు సహాయ సామాగ్రిని పంపించాల్సి ఉంది. అందుకు అక్కడికి బయలుదేరేందుకు రన్ వేపైకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంపై జపాన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తుంది. ఆ అధికారులు ఇప్పటికే కోస్ట్ గార్డ్ విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకోగా.. ఎయిర్ బస్ ఏ350లోని బ్లాక్ బాక్స్ మాత్రం ఇంకా దొరకలేదు. ప్రమాదం వల్ల దాదాపు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి.