Home > అంతర్జాతీయం > ప్రజలకు ఫ్రీగా సన్స్క్రీన్లు పంచుతున్న ప్రభుత్వం

ప్రజలకు ఫ్రీగా సన్స్క్రీన్లు పంచుతున్న ప్రభుత్వం

ప్రజలకు ఫ్రీగా సన్స్క్రీన్లు పంచుతున్న ప్రభుత్వం
X

నెదర్లాండ్స్ లో ఎండల తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. దాంతో ప్రజలు చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా చర్య క్యాన్సర్ బారిన పడ్డవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా సన్ స్క్రీన్ లోషన్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. సన్ స్క్రీన్ లను స్కూల్స్, కాలేజీలు, పార్కులు, గ్రౌండ్స్ సహా.. దేశంలోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు.

బ్రెడా నగరంలో జరిగిన ఉత్సవాల్లో అక్కడి ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. ప్రజలు సన్ స్క్రీన్ లు తరచూ వాడుతుంటే.. చర్మ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని ఆ దేశ డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో అన్ని వయసుల వారు ముఖ్యంగా వేసవి కాలంలో సన్ స్క్రీన్ తప్పని సరిగా వాడాలని సూచిస్తోంది అక్కడి ప్రభుత్వం. సన్ స్క్రీన్ వాడకుండా ఇళ్లనుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచించింది. గతంలో కొవిడ్ టైంలో కూడా నెదర్లాండ్స్ ప్రభుత్వం ఉచితంగా శానిటైజర్లు పంపిణీ చేసింది.

Updated : 14 Jun 2023 12:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top