Home > అంతర్జాతీయం > జాగ్రత్త...మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది.

జాగ్రత్త...మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది.

జాగ్రత్త...మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది.
X

కరోనా తగ్గిపోయింది అనుకున్నారు....మళ్ళీ మామూలుగా బతకొచ్చు అని కూడా అనుకున్నారు. నెమ్మదిగా జనం బయటకు వస్తున్నారు. కానీ చాప కింద నీరులా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ లను సృష్టించుకుంటూ ఆందోళనకు గురి చేస్తోంది.

మనకు తెలిసి కరోనాలో ఒమిక్రానే లాస్ట్ వేరియంట్. అది వచ్చింది కానీ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. జనాలు కొన్నాళ్ళు భయపడ్డా...పెద్దగా ప్రభావం చూపించకపోవడం వలన మళ్ళీ మామూలు అయిపోయారు. కానీ ఇప్పుడు మరో కొత్త కోవిడ్ వేరియంట్ భయపెడుతోంది. ఈజీ.5.1 గా రూపాంతరం చెంది యూకేలో చాలా వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్ లోని హెల్త్ అధికారులు చెబుతున్నారు. దీనిని ఎరిస్ పేరుతో పిలుస్తున్నారు. ప్రస్తుతం యూకేలో దాదాపు 14.6 శాతం కేసులు ఉన్నాయని తెలిపారు. కరోనాకు సంబంధించి ఇప్పటివరకు ఏడు వేరియంట్ లు వచ్చాయి...అయితే అవన్నీ ఒక ఎత్తు, ఎరిస్ ఒక్కటీ ఒక ఎత్తు అంటున్నారు. కేవలం ఒక్క వారంలోనే కొత్త వేరియంట్ కు సంబంధించి సుమారు నాలుగు వేల కేసులు వచ్చాయని చెప్పారు.

జులైలో కొత్త వేరియంట్ ఎరిస్ ని గుర్తించారు. జులై 31న ఎరిస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతానికి వృద్ధులలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. కానీ నెమ్మదిగా ఇతరులకు కూడా వ్యాపిస్తుండడంతో అక్కడి అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిలో కొంతలో కొంత సంతోషించవలసిన విషయం ఏంటంటే ఐసీయూలో ఎవరూ చేరడం లేదు.

డబ్ల్యూహెచ్ఓ కూడా కరోనా కొత్త వేరియంట్ గురించి హెచ్చరించింది. ప్రజలంతా ముందుగానే వాక్సిన్ లు తీసుకోవాలని....సురక్షిత పద్ధతులను పాటించాలని సూచించారు డబ్ల్యూహెచ్ఓ జనరల్ టెడ్రోస్ అధనామ్. మరోవైపు కొత్త వేరియంట్ మీద సైంటిస్టులు,నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు.



Updated : 5 Aug 2023 2:29 PM IST
Tags:    
Next Story
Share it
Top