Home > అంతర్జాతీయం > చైనావోడి తెలివికి సలామ్.. ఖతర్నాక్ వ్యాలెట్ రోబో.. వీడియో

చైనావోడి తెలివికి సలామ్.. ఖతర్నాక్ వ్యాలెట్ రోబో.. వీడియో

చైనావోడి తెలివికి సలామ్.. ఖతర్నాక్ వ్యాలెట్ రోబో.. వీడియో
X

గుండు సూది నుంచి గునపం వరకు, ఆటబొమ్మల నుంచి అంతరిక్ష నౌకల వరకు చైనావాళ్లు చేయనిది ఏదీ లేదు. నానా వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తుతున్న చైనీయులు జపనీయులను దాటి ఎప్పటికప్పుడు కొత్తకొత్త పరికరాలను తయారుచేస్తుంటారు. తాజాగా వ్యాలెట్ రోబోను తయారు చేసి పార్కింగ్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. ఈ రోబో పుణ్యమా అని రాంగ్ పార్క్ చేసిన కార్లను టోవంగ్ వాహనాలతో లాగడం, ఎత్తిపడేయడం వంటి సమస్యలు తీరిపోయాయట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో.. సమతలంగా ఉన్న రోబో రాంగ్ పార్క్ చేసి కారు కిందికి వెళ్లి టైర్లను గ్రిప్‌తో పట్టుకుంటుంది. తర్వాత కారును కదలించి అసలు పార్కింగ్ స్థలంలో తీసుకెళ్లి ఉంచుతుంది. దీన్ని ట్రాఫిక్ పోలీసులు రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేశారు. ఈ వీడియోను చూసిన జనం నానా కామెంట్లూ పెడుతున్నారు. పార్కింగ్ సిబ్బంది కష్టాలు తప్పాయని కొందరు అంటుంటే, దొంగలు పని మరింత ఈజీ అయిందని మరికొందరు అంటున్నారు. మోటార్ బైకులకు కూడా ఇలాంటి పరికరం కావాలని మరికొందరు కోరుతున్నారు.

Updated : 19 Aug 2023 12:22 PM IST
Tags:    
Next Story
Share it
Top