Home > అంతర్జాతీయం > Nikki Haley : భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nikki Haley : భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nikki Haley : భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది..  నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. అమెరికాకు భారత్ భాగస్వామిగా ఉండాలనుకుంటుందని తెలిపారు. ఇప్పటికైతే యూఎస్ పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం వారికి విశ్వాసం లేదని నిక్కీ పేర్కోన్నారు. భారత్ స్మార్ట్ గా వ్యవహరిస్తోందనడానికి వారు రష్యాకు సన్నిహితంగా ఉండటమే నిదర్శనమని ఫాక్స్ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

తాను అమెరికా తరఫున భారత్ వ్యవహారాలు చూశానని నిక్కీ హేలి అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడానని.. అయితే వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని నిక్కీ అన్నారు.

అయితే ప్రస్తుతం భారత్ కు యూఎస్ నేతృత్వంపై నమ్మకం లేదని, అమెరికా చాలా బలహీనంగా ఉందని అనుకుని భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని తెలిపారు. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా ఫోకస్ చేస్తోందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని తెలిపారు. నెవడా రాష్ట్రంలో రిపబ్లికన్‌ ప్రైమరీలో నిక్కీ హేలీ ఓటమి చవిచూశారు. రేసులో ఆమె కంటే ముందున్న డోనాల్డ్‌ ట్రంప్‌ దీంట్లో పోటీచేయలేదు. బ్యాలట్‌ పత్రంలో అభ్యర్థుల పేర్లతో పాటు నోటా తరహాలో ‘ఈ అభ్యర్థులెవరూ కారు’ అనే కాలమ్‌ను ఉంచారు. హేలీకి 31 శాతం ఓట్లు రాగా, నోటాకు 63 శాతం వచ్చాయి. నెవడాలో 1975లో నోటాను ప్రవేశపెట్టిన తరవాత ఓటమి చవిచూసిన అభ్యర్థి హేలీయే. ఆమె స్వరాష్ట్రం దక్షిణ కరోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ట్రంప్‌, హేలీలు పోటీపడనున్నారు.

Updated : 8 Feb 2024 9:52 AM IST
Tags:    
Next Story
Share it
Top