Home > అంతర్జాతీయం > అక్రమ సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ వింత రూల్..

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ వింత రూల్..

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ వింత రూల్..
X

చైనాలోని ఓ కంపెనీ వింత రూల్ పెట్టింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులెవరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భార్య/భర్తకు విడాకులు కూడా ఇవ్వొద్దని నింబంధన పెట్టింది. ఒకవేళ ఈ రూల్స్ అతిక్రమిస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.

జూన్‌ 9న ఓ కంపెనీ జారీ చేసిన ఈ నిబంధనలపై చైనాలోని సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఇది కాస్తా అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. కంపెనీ అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. కుటుంబానికి విశ్వాసంగా ఉండడం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పని తీరు కూడా బాగుంటుందన్న భావనతో ఈ రూల్స్ రూపొందించినట్లు స్పష్టం చేశారు.

కంపెనీ పెట్టిన నిబంధనలపై చైనా సోషల్‌ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొందరి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై ఆంక్షలు విధించడం సరికాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి నిబంధనలతో కుటుంబాలు నిలబడతాయని అంటున్నారు. షాంఘైలోని ‘వీ అండ్‌ టీ లా’ కంపెనీ లాయర్‌ మాత్రం న్యాయపరంగా ఈ నిబంధన సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పనితీరును ఆధారంగానే ఉద్యోగిని తొలగించాలని ఇలాంటి కారణాలతో విధుల నుంచి తొలగిస్తే కోర్టులో చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. కంపెనీ నిబంధనల్లో వివాహేతర సంబంధాలపై నిషేధాన్ని చేర్చినా అది చట్ట సమ్మతం కాదని అన్నారు.

Updated : 18 Jun 2023 12:30 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top