Home > అంతర్జాతీయం > Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్ట్లకు నోబెల్

Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్ట్లకు నోబెల్

Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్ట్లకు నోబెల్
X

వైద్య శాస్త్రంలో అందించిన విశేష కృషికి గానూ నోబెల్ పురస్కారం ఇస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం.. ఈ ఏడాది కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ లను వరించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరి ఆవిష్కరణలు.. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించారు. అందుకు గానూ వీళ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్ లోని నోబెల్ బృదం అవార్డ్ ప్రకటించింది.





యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో.. హంగేరీకి చెందిన కాటలిన్‌ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌ కొవిడ్ వ్యాక్సిన్ పై పరిశోధనలు జరిపారు. వీళ్ల పరిశోధనల కారణంగా 2020 చివర్లో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. కాగా నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్లకు ఇచ్చే నగదును ఈ ఏడాది కాస్త పెంచారు. పోయిన ఏడాది 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు ఉండగా.. దాన్ని 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్లకు పెంచారు. ఈ కరెన్సీ విలువ పడిపోతున్న క్రమంలో నగదు బహుమతిని పెంచినట్లు తెలుస్తుంది. ఈ నగదును నోబెల్ గ్రహీతలకు డిసెంబర్ 10న అందిస్తారు.




Updated : 2 Oct 2023 4:48 PM IST
Tags:    
Next Story
Share it
Top