Home > అంతర్జాతీయం > ఉత్తర కొరియా నియంతకు నిద్రలేమి జబ్బు?

ఉత్తర కొరియా నియంతకు నిద్రలేమి జబ్బు?

ఉత్తర కొరియా నియంతకు నిద్రలేమి జబ్బు?
X

తన కిందున్న దక్షిణ కొరియాతోపాటు సుదూ ఖండాల అవతల ఉన్న అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు కూడా నిద్రపట్టకుండా భయపెడుతున్న నియంతకు నిద్ర కరువైంది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోన్ ఉన్ నిద్రలేమితో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ చెప్పింది. దురలవాట్లు, అధిక బరువు తదితర సమస్యల వల్ల కిమ్ సరిగ్గా నిద్రపోవడం లేదని ద.కొరియా గూఢచర్య సంస్థ ఎన్ఐఎస్ తెలిపింది. ఆ సంస్థ సేకరించిన వివరాల ప్రకారం..

కిమ్ బరువు ఇటీవల 140 కేజీలకు పెరిగింది. ధూమపానం, మద్యపానం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. నిద్ర పట్టక కళ్లకింద నల్ల వలయాలు మొదలయ్యాయి. చికిత్స కోసం ఉ. కొరియా అధికారులు తంటాలు పడుతున్నారు. జోల్పిడియం వంటి మందులు వేస్తే బావుంటుందని ఇంటర్నెట్ వివరాలను తెగ శోధిస్తున్నారు. కిమ్ గత ఫోటోలతో పోల్చితే ఇప్పుడు అధిక బరువుతో బాధపడుతున్నట్లు కృత్రిమ మేధ సాయంతో కనిపెట్టారు. కిమ్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు బాగా అలసిపోతున్నాడు. అతని చేతులు, మోచేతులపై ఏవో గీతలు ఉన్నాయి. ఉత్తర కొరియా కొన్నాళ్లుగా ఆహార సంక్షోభంతో అల్లాడిపోతోంది. విదేశాల నుంచి చాక్లెట్లు, ఆహారధాన్యాలు భారీ స్థాయిలో దిగుమతి చేస్తుకుంటోంది. ఇలాంటి మరికొన్ని వివరాలను కూడ ద. కొరియా వెల్లడించింది. అయితే వీటికి సరైన ఆధారాల్లేవని కొందరు కొట్టిపడేస్తున్నారు. ఉత్తర కొరియా విషయాలు బయటి ప్రపంచానికి తెలియకపోవడంతో పక్కనే ఉన్న దక్షిణ కొరియా చెప్పిందే వేదమని పాశ్చాత్య మీడియా భావన. కిమ్‌కు కేన్సర్ వచ్చిందని, చచ్చిపోయాడని కూడా వార్తాలు వచ్చాయి. మరోపక్క కిమ్ తను ఏం చేయాలో అది చేసి హడలెత్తిస్తుంటాడు.




Updated : 1 Jun 2023 6:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top