తిండిలేక అల్లల్లాడుతున్న ఉత్తర కొరియా ప్రజలు
X
నార్త్ కొరియా దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ప్రజలు తిండిలేక అల్లల్లాడుతున్నారు. కానీ ఆ దేశ అధ్యక్షుడికి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. ఎవరెలా పోతేం నాకేంటి నేను మాత్రం విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తాను అంటూ చెలరేగిపోతున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.
కిమ్ జీవితంచాలా ఖరీదుగా ఉంటుందట. అతను తినే తిండి, తాగే మందు, సిగెర్టుల అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి అని చెబుతున్నారు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు. డైలీ స్టార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. కిమ్ అత్యంత ఖరీదైన మద్యం తాగుతాడని చెబుతున్నారు. హెన్నెసీ అనే లిక్కర్ నే కిమ్ తాగుతారుట. దీని ఖరీదు అక్షరాలా 7 వేల డాలర్లు...అంటే మన కరెన్సీలో 5 లక్షల రూపాయలు. పైగా తాను తాగే మద్యం అంతా పై దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాడుట. దీనికోసం అతను ఏడాదికి పెట్టే ఖర్చు 30 మిలియన్ డాలర్లు. ఈ విషయాన్ని కొన్నేళ్ళ క్రితం చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కామర్స్ కస్టమ్స్ బయటకు పెట్టింది.
ఇక కిమ్ తాగే సిగరెటట్లు అయితే బంగారపు రేకుతో చుడతారుట. అలాగే చాలా రేర్ గా దొరికే ఆహారాన్ని కిమ్ తింటారుట. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్, స్విస్ ఛీజ్ లను దిగుమతి చేసుకుంటారు. కిమ్ కు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమటపైగా. పిజ్జాలు తెగ తింటాడుట. దానికోసం ఏకంగా ఇటలీ నుంచి ఛెఫ్ ను కూడా రప్పించుకున్నాడుట కూడా. ఇక తనకిష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి ఏడాది కిమ్ 9.6 లక్షల డాలర్లను వెచ్చిస్తాడుట. ఈ విషయాల్నీ కిమ్ దగ్గర ఇంతకు ముందు పని చేసే చెఫ్ ఒకరు చెప్పారు.
యూకే రిపోర్ట్ అయితే కిమ్ మంచి రసికుడు అని కూడా చెబుతున్నాడు. తన లైంగిక సామర్ధ్యం పెంచుకోవడం కోసం ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. కిమ్ విపరీతమైన బరువు పెరిగిపోయాడని సౌత్ కొరియా ఇంటలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా అయిపోయింది. దీంతో అక్కడ కరువు రాజ్యమేలుతోంది. దేశంలో నిత్యావసర అవసరాలు కూడా దొరకడం లేదు. చైనా నుంచి ఇంతకు ముందు దిుగమతులు ఉండేవి. ఇప్పుడు అవి ఆగిపోవడంతో ఉత్తర కొరియా జనాలకు తిండానికి సరైన తిండి అల్లలాడుతున్నారు.