Home > అంతర్జాతీయం > పెళ్లి చేసుకుంటే పైసలు.. ఎవరికైనా సరే..

పెళ్లి చేసుకుంటే పైసలు.. ఎవరికైనా సరే..

పెళ్లి చేసుకుంటే పైసలు.. ఎవరికైనా సరే..
X

పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయడం మామూలే. కాకపోతే చాలా షరతులు ఉంటాయి. పేదలకు మాత్రమే సాయం అందుతుంటుంది. కొన్ని దేశాల్లో మాత్రం అందరికీ డబ్బులు ఇస్తుంటారు. తాజాగా చైనాలో ఓ మునిసిపాలిటీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. పెళ్లి చేసుకునేవాళ్లందరికీ 1000 యువాన్లు( రూ. 11,430) ఇస్తామని చాంగ్‌షాన్ కౌంటీ అధికారులు టామ్ టామ్ వేస్తోంది. కాకపోతే తొలిసారి పెళ్లి చేసుకునేవారు, అమ్మాయి వయసు 25 లోపు ఉంటేనే ఈ పథకానికి అర్హులు. చైనాలో జనాభాతోపాటు, పెళ్లిళ్ల సంఖ్య కూడా నానాటికీ గణనీయంగా తగ్గిపోతుండడంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు స్థానిక ప్రభుత్వాలు నానా పథకాలు అమలు చేస్తున్నాయి. నగదు, ప్రత్యేక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తున్నాయి. అయినా చైనీయులు మాత్రం పెళ్లాడ్డానికి ముందుకు రావడంలేదు.

చైనాలో వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతం పదేళ్లలో విపరీతంగా పడిపోతోంది. గత ఏడాది కేవలం 68 లక్షల పెళ్లిళ్లే నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 లక్షలు తక్కువ. యువత బాదరబందీలేని సహజీవనానికే మొగ్గుచూపుతోంది. వారికి ఎలాగైనా కలిపి, పిల్లలను పుట్టించాలని కమ్యూనిస్టు ప్రభుత్వం తాయిలాలు ఆశచూపుతోంది. సంతానోత్పత్తి రేటుగా నామ్ కే వాస్తేగా ఉండడంతో దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచంలో అత్యంత తక్కువగా కేవలం 1.09శాతంగా ఉన్న రేటును పెంచి ఒక జంట ఇద్దర్ని కనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఒక జంటకు ఒక బిడ్డ నినాదాన్ని కఠినంగా అమలు చేసిన సమస్యలు తెచ్చుకున్న చైనా.. సంతానోత్పత్తి తగ్గిపోతే పనిచేసే వారికి సంఖ్య కూడా తగ్గి, ముసలి జనాభా పెరుగుందని భయపడుతోంది.

Updated : 29 Aug 2023 11:34 AM IST
Tags:    
Next Story
Share it
Top