Home > అంతర్జాతీయం > Israel : ఇజ్రాయిల్‌లో ఉన్న ఇండియన్స్ కోసం 'ఆపరేషన్​ అజయ్'

Israel : ఇజ్రాయిల్‌లో ఉన్న ఇండియన్స్ కోసం 'ఆపరేషన్​ అజయ్'

Israel : ఇజ్రాయిల్‌లో ఉన్న ఇండియన్స్ కోసం ఆపరేషన్​ అజయ్
X

ఇజ్రాయిల్- పాలస్తీనా గ్రూప్ హమాస్ మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న నేపథ్యంలో... (Israel )ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది కేంద్రం. ఇజ్రాయిల్ లో ఉన్న 18,000 మంది భారతీయులను ప్రత్యేక చార్టర్ విమానాల ద్వారా స్వదేశానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం నేడు దేశానికి చేరుకోనుంది.






విదేశాలలో ఉన్న భారతీయుల భద్రత, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. మన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. ఈ రోజు నుంచే ఆపరేషన్ అజయ్ ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం అధికార ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌లో 20 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని చెప్పారు. ఇరు దేశాల యుద్ధంతో భారతీయులెవరికీ గాయాలైనట్లుగా, మరణించినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.





ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయక కేంద్రాలను(హెల్ప్‌లైన్‌) ఢిల్లీ, టెల్‌అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసింది. ఢిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు.. 1800118797 (టోల్‌ఫ్రీ), +91-11-23012113, +91-11-23014104, +911123017905, +919968291988, situationroom@mea.gov.in;

భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు +97235226748, +972543278392, cons1.telaviv@mea.gov.in; +970592916418 (వాట్సప్‌ కూడా), rep.ramallah@mea.gov.ఇన్






ఇజ్రాయిల్‌, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం జరుగుతోంది. గాజా వేదికగా హమాస్ యోధులు ఇజ్రాయిల్‌పై తీవ్ర దాడులు చేస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్‌ ప్రతీకారం తీర్చుకుంటూ.. పాలస్తీనాపై నిరంతరం దాడులు చేస్తోంది. గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయిల్‌ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. అటువంటి పరిస్థితిలో యుద్ధం చాలా రోజులు కొనసాగవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.




Updated : 12 Oct 2023 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top