దేశ ప్రజలకు షాక్.. మాజీ ప్రధానికి మూడేళ్ల జైలు శిక్ష
X
పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లపాటు ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా నిషేదం విధించడంతో పాటు.. లక్ష పాక్ రూపాయల జరిమానా వేసింది. ఈ మొత్తం చెల్లించకపోతే మరో ఆరు నెలల జైలు శిక్ష పొడగించనుంది.
ఈ నేపథ్యంలో ఆయన అంతకుముందు మాట్లాడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ‘అరెస్ట్ ను ముందే ఊహించా. అరెస్టుకు ముందే ఈ మెజేజ్ ను రికార్డు చేశా. నా పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా, దృఢంగా ఉండాలి. ఏ పరిణామాలు ఎదురైనా ఓపికగా వేచి చూడండ’ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలో తోషఖానా అవినీతి గురించి చర్చ మొదలయింది. అసలు ఈ తోషఖానా అవినీతి అంటే ఏంటంటే..
పాకిస్తాన్ ప్రముఖులు ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు అందుకుంటే.. పదివి నుంచి దిగిపోయేటప్పుడు వాటిని తోషాఖానాలో జమ చేయాలి. లేదంటే వాటికయ్యే ఖర్చులో సగం ధర చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నటైంలో ఆయనకు వచ్చిన బహుమతుల్ని పర్మిషన్ లేకుండా అమ్ముకున్నాడు.