Home > అంతర్జాతీయం > పాక్లో న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం.. ఎందుకంటే..?

పాక్లో న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం.. ఎందుకంటే..?

పాక్లో న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం.. ఎందుకంటే..?
X

గాజా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గతకొంత కాలంగా ఒకదేశంపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఇరుదేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్తాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. అక్కడి ప్రజలకు సంఘీభావంగా ఈసారి తమ దేశంలో న్యూఇయర్ వేడుకలు చేసుకోవద్దని నిర్ణయించుకుంది. ఈ మేరకు వేడుకలపై సంపూర్ణ నిషేదం విధిస్తూ పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న రాత్రి (డిసెంబర్ 29) పాక్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కాకర్.. ఈ విషయాన్ని తెలిపారు. యుద్ధం వల్ల సతమతం అవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే పాక్ రెండుసార్తు మానవతా సాయం అందించింది. త్వరలో మరోవిడత సాయం అందిస్తున్నట్లు తెలిపారు.




Updated : 29 Dec 2023 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top